పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీకృష్ణుఁడు ముచికుందునకుఁ దన వృత్తాంతము నెఱుఁగఁ జెప్పుట

“వసుదేవతనయుఁడ వాసుదేవుఁడను
సమసాహసుఁ గంసు వలీలఁ జంపి
సలక రాక్షస థనంబు సేసి
థురాపురంబు నెమ్మది నేలుచుండ
ధికసత్వుఁడు కాలవనుఁ డేతించి
లిమీరి మాపట్టము నిరోధింప
నెలయించి యాతని నిటుతోడితేర
నీకోపశిఖచేత నీరయ్యెనాతఁ
డేకతంబీ గుహనేల యున్నాఁడ? 640
వాదిరాజులకంటె ధికుండవైతి
మేదినీశ్వర! నిన్ను మెచ్చితి వరము
పోఁడిగా నిచ్చెదఁ బొరి నేదియైన
వేఁడుము నీ” వన్న వినతుఁడై పలికె
“దివ్యతేజోమయ! దేవేంద్రవంద్య!
వ్యయాత్మజ! కృష్ణ! అంభోజనయన!
క్తపరాధీన! క్తలోకేశ!
క్తవ్రజత్రాణ! రమకల్యాణ!
రాజ్యంబు సేసి యారాజులలోన
పూజ్యుఁడనై మని పుత్రులఁ గంటి
నదాన్యవస్తుసంతియందు నాకు
నమురోయుట సేసి దికోర్కెలుడిగె
నేకర్మములు మాని యీగుహాంతమున
నేకచిత్తుండనై యిటనిద్రవోవ
నామీఁదఁ గృపఁ గల్గి న్నుమన్నింప
నీవిందు విచ్చేసితేఁ గృతార్థుఁడను; 
బ్రహ్మయోగీంద్రులు భావింపలేని 
బ్రహ్మమైతోఁచు నీ దపంకజములుఁ
నుఁగొంటి నీదులోముఁ బ్రసాదింపు
నజాక్ష ఏనొండు రమొల్ల” ననుఁడు.   - 650